WhatsApp Image 2024-02-03 at 3.22.04 PM Kakinada

4 వ రోజుకు చేరుకున్న జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 4వ రోజైన శనివారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్. వాటా కూడా కార్మికుల జీతాల నుండే కత్తిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై […]

WhatsApp Image 2024-02-02 at 7.36.43 PM Konaseema

రాయపురెడ్డి పార్టీ సీటు పై ప్రజల ఉత్కంటత…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం లో ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు . అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సురిబాబు( రాజా) గెలుపు కు మహిళలు యువత ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇప్పటికే […]

WhatsApp Image 2024-02-02 at 7.09.20 PM Kakinada

కాకినాడ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జె. వెంకటరావు…

కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ గా జె. వెంకటరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం కొండయ్య పాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమీషనర్ గా ప్రస్తుతం పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న నాగనరసింహారావు నుండి ఛార్జ్ తీసుకుని నూతన కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సంబందిత అధికారులు ఆయనకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. జె.వెంకటరావు ఇప్పటి వరకు పార్వతి పురం మన్యం జిల్లా లో […]

WhatsApp Image 2024-02-02 at 5.41.22 PM Trending News

సమ్మె చేసే పరిస్థితి రాకుండా సమస్యలు పరిష్కరించండి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 3 వ కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… పేదలకు సేవలు అందించడం లో జి.జి.హెచ్. కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాము సమ్మె చేస్తే ప్రజలకు, చాలా ఇబ్బందులు కలుగుతాయన్నారు‌. అందువల్ల చాలా ఓపికగా తమ సమస్యలను అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ వారికి విన్నవిస్తూ వచ్చామన్నారు. సమ్మె చేసే పరిస్థితి […]

WhatsApp Image 2024-02-02 at 5.37.29 PM Trending News

పంట బ్యాంకు రుణాల పరిమితులపై సమావేశం… -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్-

రాబోయే 2024-25 సంవత్సరానికి గాను కోనసీమ జిల్లా వ్యాప్తంగా సాగులో ఉన్న పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్సును జిల్లా యంత్రాంగం, బ్యాoకర్ల సమన్వయంతో నిర్ణయించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్ అజయ్ వెల్లడించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జే.సీ. అధ్యక్షతన బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ నిర్ణయాల మేరకు స్థానిక వ్యవసాయ పెట్టుబడులను వ్యవసాయ అధికారుల […]

WhatsApp Image 2024-02-02 at 5.36.28 PM Crime

కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌… కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం…

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ […]

WhatsApp Image 2024-02-02 at 5.35.53 PM Exclusive

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలి… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లాకు నియమించిన అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. జిల్లా కలెక్టర్ […]

WhatsApp Image 2024-02-02 at 3.50.28 PM Exclusive

వినియోగదారుల రక్షణ చట్టంప్రయోజనాలు విస్కృతం చేయాలి…

జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ఆదిత్య కు కాకినాడ పౌర సంక్షేమసంఘం గణపతి చిత్రపటాన్ని బహూకరించి పుష్ప గుచ్ఛంతో అభినందన లు తెలిపింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తమిళనాడు నుండి 2016 లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ 79 ర్యాంకు సాధించిన ప్రవీణ్ గతంలో రంపచోడవరం ఐ.టి.డి.ఎ. అధికారిగా పోలవరం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా మంచి గుర్తింపుతో కాకినాడ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం […]

WhatsApp Image 2024-02-02 at 2.57.32 PM Crime

కర్నూలు పోలీసుల వాహానాల తనీఖీలు… 4 గురు అరెస్ట్…???

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు వాహానాల తనిఖీలు చేపట్టారు. క్రిష్ణగిరి మండలం, అమకతాడు గ్రామ శివారులోని జాతీయ రహదారి 44 పై ఉన్న టోల్ ప్లాజా వద్ద కర్నూల్ స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల సమాచారంతో హైదరాబాదు నుండి కోయంబత్తూరు వెళుతున్న NL 01 M 2506 సురేష్ స్వామి అయ్యప్ప ప్రైవేట్ స్లీపర్, ఏ.సి. ట్రావెల్స్ బస్సు నందు నలుగురు నుండి బంగారం, వెండి […]

WhatsApp Image 2024-02-02 at 12.37.53 PM Crime

సెలవు పెట్టి మరీ ఈ రాష్ట్ర పోలీసులు గంజాయి సరఫరా…

హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూఅంద్ర ప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏ.పీ.ఎస్.పీ. కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు సెలవు పెట్టి మరీ నర్సీపట్నం నుంచి బాచుపల్లికి గంజాయి తరలించినట్లు తెలుస్తోంది. గురువారం అర్ధరాత్రి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని బాలానగర్‌ ఎస్‌వోటీ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల వాహనం నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.