మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనం పెంచాలి…
కాకినాడ డీ.ఈ.వో. ఆఫీసు వద్ద సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి ఆర్.జే.డీ. కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, కాకినాడ జిల్లా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతూ… వై.ఎస్. జగన్ అధికారంలోకి రాగానే మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తాననిఇచ్చిన హామీను మరిచి పోయారన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నిత్యవసర ధరలు భారీగా పెరిగాయన్నారు. […]








