dwarampudi-shocking-comments (1) Exclusive

రజక కమ్యూనిటి హాల్ ను ప్రరంభించిన ద్వారంపూడి…

కాకినాడ జిల్లాలో కాకినాడ 44వ డివిజన్ శారదాదేవి ఆలయ ప్రాంతంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులయిన రూ. 99.60 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటి హాల్ ప్రరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్స కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఆయన తొలత ప్రజ్వలన వెలిగించి రిబ్బన్ కత్తిరించి కమ్యూనిటి హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి […]

OIP (22) Viral

జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం…

కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్ మార్చుకుంటున్న లారీ డ్రైవర్స్ మరియు క్లీనర్ ను గుర్తు తెలియని బస్ వచ్చి వేగంగా గుద్దింది అదే దారిలో ఉన్న షోల్డర్ సైడ్ వున్నా బెగ్గర్ ను కూడా గుద్ది వెళ్లిపోయింది. ఇందులో మొత్తం 4 గురు చనిపోయారు. ఇద్దరు డ్రైవర్స్, ఒక క్లీనర్ మరియు బెగ్గర్ ఉన్నట్లు […]

BB1iRlno Movies

రాయాన్ మూవీ పోస్టర్ రిలీస్…

తమిళ్ హీరో ధనుష్ తన 50వ వెంచర్ రాయాన్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇది అతని రెండవ దర్శకత్వ వెంచర్ కూడా. గత వారం అతను చిత్రం నుండి సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్ మరియు ఎస్.జే. సూర్య క్యారెక్టర్ పోస్టర్‌లను పంచుకున్నాడు. ఇప్పుడు నటుడు ‘రాయాన్’ మూవీ హీరోయిన్ అపర్ణా బాలమురళిని స్వాగతించడానికి తన ట్విట్టర్ ఖాతాలోకి తీసుకున్నాడు. ఫిబ్రవరి 25 వ తేదీన ధనుష్ ఈ చిత్రం నుండి అపర్ణ యొక్క చిత్రాన్ని బయట పెట్టారు. […]

WhatsApp Image 2024-02-25 at 7.32.17 PM (1) Viral

ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. […]

tdp-flag-22-1503346947 Political

టీ.డీ.పీ. పై పలువురు నాయకుల అసంతృప్తి…

టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ అందులో చోటు దక్కించుకోవడంలో పలువురు సీనియర్ నేతలు విఫలమయ్యారు. ప్రధానంగా టీ.డీ.పీ. సీనియర్లు కె. కళా వెంకటరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్‌రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు పేర్లు జాబితాలో కనిపించలేదు. టీ.డీ.పీ. కి మద్దతు పలికిన నలుగురు వైఎస్సార్సీ ‘రెబల్’ ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు మాత్రమే జాబితాలో ఉంది. అనంతపురం జిల్లా […]

WhatsApp Image 2024-02-25 at 5.24.09 PM Exclusive

ఈ.ఎస్.ఐ.సి. హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాని…

కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి, అప్పటి కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగవర్ కి బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి కాకినాడ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఈరోజు కాకినాడలో కార్మికుల సంక్షేమం కోసం 113 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన […]

maxresdefault (7) Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ ఉద్యమ శంఖారావం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కాని ఏ.పీ. జే.ఏ.సి. ఛలో విజయవాడ కార్యక్రమానికి కమిషనర్ ఆఫ్ పోలీస్ అనుమతులు ఇవ్వనందున అనుమతులు లేని సభలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని, అటువంటి కార్యక్రమాలకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్, […]

WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1) Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం […]

WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సీ.ఎం.ఆర్‌. ధాన్యం తీసుకున్న రైస్‌ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి […]

WhatsApp Image 2024-02-25 at 4.29.46 PM Crime

టీవీ యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేసిన యువతి…!

టీవీ యాంకర్ ప్రణవ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒక యువతి కిడ్నాప్ చేసింది. మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో ప్రణవ్ అనే జెమిని టీవీ యాంకర్ ఫోటో చూసి త్రిష్ణ అనే యువతి అతని వెంటపడి పెళ్లి చేసుకోవాలని కిడ్నాప్ చేయించింది. అక్కడినుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులకు ఫిర్యాదుచేసాడు. దానోతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తప్పించుకున్న ప్రణవ్ ఫిర్యాదుతో యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు.