images (13) Political

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి… -కొండబాబు –

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయకత్వంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌కు గ్యారెంటీ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమoలో భాగంగా కొండబాబు స్థానిక 39 వ డివిజన్ నందు పర్యటించి ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.

Screenshot_20231109_095446 Political

పవన్ పై ఓ.యూ విద్యార్థులు ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ లో ఓ.యూ. జే.ఏ.సీ. నేతలు ఫైర్ అయ్యారు. డూప్ లేకుండా నటించలేని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కోట్లల్లో దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక 14 రోజుల పాటు ఆహారం మానేసిన వ్యక్తి, ఇప్పుడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ను తరిమి తరిమి కొడతాం అని ఓ.యూ. విద్యార్థులు అల్టిమేటం జారీ చేశారు.

WhatsApp Image 2023-11-03 at 7.22.09 AM Political

మద్యం టెండర్ల లో చంద్రబాబు తప్పు చేసాడనడం సిగ్గుచేటు…. – కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని-

చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియటంతో మద్యం టెండరు లో అవినీతి జరిగిందని కేసు పెట్టారని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆరోపించారు. అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంద్రపాలెం ధర్నా చౌక్, అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు, తెలుగు దేశం బీ.సీ. కమిటీ నాయకులతో నిరసన ధర్నా చేపట్టారు.

IMG-20231031-WA0017 Political

విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పాలి… – బీజేపీ మహిళా మోర్చా డిమాండ్-

రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై జరుగుతున్న అక్రమాలను ఎత్తి చూపినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎం.పీ. విజయ సాయి రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ” పురందేశ్వరి మద్యం సేవిస్తారేమో నాకు తెలియదు – కానీ నేను మద్యం సేవించను” అని అవమానకరంగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న దుయ్యబట్టారు. మహిళల పట్ల వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ […]

images (9) Political

రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి…

రైలు ప్రమాదం లో గాయపడిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి సర్వజన ఆసుపత్రి లో బాధితులకు స్వయంగా కోటి 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నాని చెప్పి, పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్ళాలని చైర్మన్ తెలిపారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారని అన్నారు. […]

IMG-20231031-WA0009 Political

ఇసుకలో 2000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు… -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి-

ఇసుక విషయంలో పాలకులు ఏవిధంగా జేబులు నింపుకుంటున్నారన్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియకు వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇసుక వ్యవహారాన్ని లేవనెత్తి గణాంకాలతో సహా ఛాయా చిత్రాలను ప్రదర్శిస్తూ ఇసుక వ్యవహరంలో నైనా ప్రభుత్వం సమాధానం చెబుతుందా అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అనంతమైన సహజవనరులు ఉన్న రత్నగర్భ , నదీ నదాలు ఓడరేవులు సువిశాలమైన సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రమన్నారు. భవన నిర్మాణానికి కావలసిన ఇసుక […]

WhatsApp Image 2023-10-30 at 8.23.11 PM Political

హోంమంత్రి ఎన్నికల ప్రచార రథం సిద్ధం…

2024 లో జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర హోమ్‌ మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేశారు. విషేశంగా ఆకట్టుకుంటున్న ఈ రధాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. తొలిరోజైన సోమవారం ఈ రధానికి చాగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 3వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలన్నారు.

IMG-20231028-WA0015 Political

ప్రభుత్వం నిత్యవసర వస్తు ధరలను నియంత్రించలేకపోతోంది – కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు-

నిత్యవసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కమిటీ దుయ్యబట్టింది. దరల పెరుగుదలపట్ల అన్ని వర్గాలల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ అభిప్రాయబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ కుమార్ అధ్యక్షతన పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మాణించింది. ఉద్యోగులకు జీతాలు లేవని, నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, […]

WhatsApp Image 2023-10-27 at 8.39.03 PM Political

చెప్పేదొకటి… ఆచరణ మరొకటి – తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం కొనసాగేనా…!

తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయం పైకి చెప్పేదొకటి ఆచరణలో మరొకటిగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీ ఇటీవలే 14 మంది సభ్యులతో రాజమండ్రిలో సమావేశమైంది. ఉమ్మడి కార్యాచరణతో అధికార వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. కాగా పనసపాడు గ్రామం సామర్లకోట మండలంలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌ జ్యోతుల నవీన్‌ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ టికెట్‌ […]

WhatsApp Image 2023-10-27 at 7.44.34 PM Political

వేడెక్కిన ఏపీ రాజకీయం…

2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఎత్తులకు పైఎత్తులు, నిందారోపణలతో విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉండటంతో తెలుగుదేశం పార్టీకి దిశ నిర్ధేశం ఉండదని అధికార వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ భావించింది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఆ కూటమిపై అనేక సందేహాలు, సందిగ్ధతలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగాలని ఇరుపార్టీలు […]