WhatsApp Image 2023-11-30 at 9.45.57 PM Exclusive

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చర్యలు తప్పవు… -జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా-

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధిత చట్టం(పీ.సీ.పీ.ఎన్.డీ.టీ యాక్ట్), సహాయ పునరుత్పత్తి సాంకేతిక చట్టం (అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్), సరోగసి చట్టంల మీద జిల్లా మరియు ఉప జిల్లా స్థాయి […]

Nara-Lokesh-50-days-Yuva-Galam-Padayatra Political

తాళ్లరేవు మండలంలో యువగళం పాదయాత్ర…

తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చేరుకుంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్ ను చూసేందుకు టీ.డీ.పీ అభిమానులు, ప్రజలు భారి ఎత్తున తరలి వచ్చారు. జనం భారి ఎత్తున రావడంతో రోడ్డు పై రాకపోకలు ఆగిపోవడంతో వాహనదారులు పలు ఇబ్బంలకు గురయ్యారు.

Gujarat-Massive-Fire-Broke-Out-at-Car-Showroom-in-Surat-Video Exclusive

కరపలో ఘోర అగ్నిప్రమాదం…

కలప మండలంలో పెనుగుదురు పీ.హెచ్.సీ. లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పీ.హెచ్.సీ అధికారుల సమాచారంతో జగన్నాధపురం అగ్ని మాపక అధికారులు ఘలనా స్తలానికి చేరుకొని ఆ మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్య్కూట్ అవడంతో పీ.హెచ్.సీ. లో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అధికారికి తెలిపారు.

WhatsApp Image 2023-11-29 at 5.33.37 PM Sport

డిసెంబర్ 5,6,7 న రాజమహేంద్రవరంలో జరగనున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్…

రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ జీ.ఎం.ఆర్. పాలిటెక్నీకల్ కళాశాలలో డిసెంబర్ 5,6,7 రీజనల్ లెవెల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మేట్ నిర్వ హిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి. నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆయా విభాగపు అధిపతులతో కలిసి గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు.ఈ కార్యక్రమానికి 33 పాలిటెక్నిక్ సంస్థల నుండి […]

WhatsApp Image 2023-11-29 at 5.31.20 PM Movies

ప్రజలలో చైతన్యం నింపే దిశగా సినిమా నిర్మాణం… -దర్శకుడు పీ. సత్యారెడ్డి-

జనం ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో విలేకరులతో సత్యారెడ్డి మాట్లాడారు. సీ.ఎం. జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం అడుగుతున్నా వందలాది మంది పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రయివేటికరణకే మొగ్గు చూపుతోందని చెప్పారు. గత వేయి రోజులుగా ఉద్యమాలు జరుగుతున్నా ప్రయివేటీకరణకు ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. ఈ సినిమాలో […]

WhatsApp Image 2023-11-27 at 8.33.32 PM Exclusive

అర్హులందరికీఓటు హక్కు కల్పించాలి… -సి.హెచ్. నాగ నరసింహారావు-

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉందని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ., కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పై బి.ఎల్.ఓ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగ నరసింహారావు మాట్లాడుతూ… ఫారం 6,7,8 ద్వారా వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా […]

WhatsApp Image 2023-11-27 at 8.29.57 PM Exclusive

15 వేల మంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేసేందుకు సన్నాహాలు… -కలెక్టర్ డా.కృతికా శుక్లా-

జిల్లాలోని జగనన్న కాలనీలలో వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 15 వేల మంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేసేందుకు రానున్న రెండు మాసాల్లో మెగా హౌసింగ్ డ్రైవ్ చేపట్టి నిర్మాణాలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ హౌసింగ్, సమన్వయ శాఖల అధికారులు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రానున్న రెండు నెలల్లో చేపట్టవలసిన గృహనిర్మాణ ప్రణాళిపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. ఈ […]

WhatsApp Image 2023-11-27 at 8.02.27 PM Political

ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి… -హోంమంత్రి తానేటి వనిత-

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 168వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ… వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వచ్చిన […]

WhatsApp Image 2023-11-27 at 8.00.04 PM Culture

“క్రియ“ పిల్లల పండుగలో భాష్యం విద్యార్థుల విజయ కేతనం…

భారతీయ ధర్మం సనాతన ధర్మం, భారతీయ సాంప్రదాయం అతి పురాతనం అలాగే భారతదేశంలో కళలకు అనాదిగా ఆధరణ ఉంది. మన కళలు 64 వాటిలో లలిత కళలు, జానపద కళలు ప్రధానం. దాగి ఉన్న కళను బయటకు తీయడానికి “క్రియ” పిల్లల పండుగ పేరుతో ప్రభుత్వం గత శనివారం, ఆదివారం రోజుల్లో జే.ఎన్.టీ.యూ. కాకినాడలో అనేక పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో ఒకటి దాదాపు అంతరించిపోయిన మన ప్రాచీన జానపద కళ అయిన బుర్రకథను మన […]

IMG-20231126-WA0022 Political

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్న మోడీ గో బ్యాక్… -వామపక్షాల నిరసన-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గో బ్యాక్ అంటూ కాకినాడ మసీదు సెంటర్ లో నల్ల బెలూన్లతో వామపక్షాలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, న్యూ డెమోక్రసీ నాయకులు జె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయకుండా, రాజధాని నిర్మాణానికి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చిన మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు […]