WhatsApp Image 2024-02-19 at 1.49.18 PM Viral

కాలువలోకి దూసికెళ్లిన కారు…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బెల్లంపూడి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఒక బైక్‌ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. అదే మార్గం గుండా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వెంటనే స్పందించి అక్కడున్న స్థానికుల సహాయంతో కాల్వలో దూకి కారు డోర్లు తెరిచి లోపలున్న ఏడుగురిని బయటకు తెచ్చి కాపాడారు. కానిస్టేబుల్ చేసిన పనికి అక్కడున్నవారంతా అభినందనలు తెలిపారు.

WhatsApp Image 2024-02-19 at 12.01.48 PM Viral

కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బస్సు బోల్తా…

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి వద్ద విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా నడపడంతో బస్సు అదుపుతప్పి కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కరెంట్ స్థంబానికి ఢీ కొట్టింది. దానితో ఆ బస్సు తిరగబడింది. వెంటనే స్థానికులు  స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షతంగా బయటకు తీసారు. భాదితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

WhatsApp Image 2024-02-19 at 11.46.06 AM Political

జర్నలిస్టులపై దాడులను ఖంఢించిన జనసేన అధినేత…

రాష్ట్రంలో విలేకర్లు, ఫోటో జర్నలిస్టులపై వై.సీ.పీ. ప్రభుత్వ దాడులు చేయడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యన్ మండిపడ్డారు. వై.సీ.పీ. పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుపోవడం చాలా ధారుణమన్నారు. వై.సీ.పీ. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం మాహా సభ ఆవరణలో ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు చేసిన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడ […]

WhatsApp Image 2024-02-19 at 11.20.20 AM Political

అనకాపల్లిలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ ఘనంగా సమావేశం…

అనకాపల్లిలో విశాఖ ఉమ్మడి జిల్లా మెగా అభిమానుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఒకవైపు జీవనదులు ప్రవహిస్తోన్నా రైతులకు సాగు నీరు అందడం లేదన్నారు. చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు, […]

WhatsApp Image 2024-02-19 at 11.02.30 AM (1) Political

రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది… -పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు-

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాష్ట్రంలో కూడా వై.సీ.పీ. ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని చూడలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అన్నారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు, తన పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వచ్చేది జనసిన-టీ.డీ.పీ. ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. అవినీతితో కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ […]

R Political

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీ.జే.పీ. యాత్ర…

భారత్ జనతా పార్టీ ఈ నెల 21వ తేదీ నుంచి 29 వ తేదీ వరకూ జిల్లాలో ప్రజా పోరు యాత్ర ను నిర్వహించి ప్రజల సమస్యలను తెలికుంటుందని కన్వీనర్ యాళ్ల వెకటేశ్వర రావు అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో వెళ్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అభివృద్ధి నిరోధక కార్యక్రమాలపై నిలదీసేందుకే ఈ ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ […]

04122022130312n6 Political

ధవలేశ్వరం లూధరన్ చర్చి దర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ …

తూర్పు గోదావరి జిల్లాలో ధవలేశ్వరం లూధరన్ చర్చి వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఎటువంటి విఘాతం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగించేలా మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకోవడం జరిగిందన్నారు. ఆదివారం స్థానిక ధవలేశ్వరం మెయిన్ రోడ్డు లో ఉన్న లూధరన్ చర్చ్ ని మంత్రి వేణుగోపాలకృష్ణ సందర్శించి ఏసుక్రీస్తుకు ప్రార్థనలు చేశారు. ప్రజాసేవ పరమావధిగా  వై.యస్. జగన్మోహన్ రెడ్డి  […]

hqdefault (1) Exclusive

ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లిన కోరుకొండ …

కొత్త ఆలయాలను నిర్మించడం కంటే ఉన్నవాటికి నూతనత్వం కల్పించి పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అవసరమని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. కోరుకొండ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన పలు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. ముందుగా మధురపూడి ఎయిర్ […]

DMHO_OFFICE_d25b2b2bc4 Exclusive

ఆ నోటిఫికేషన్లను వెంటనే నిలివేయండి… -డి.యం.హెచ్.వో. శర్మిష్ట-

ఐ.డి.ఎస్.పి. నందు ఖాళీగా ఉన్న ఎసిడెమియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఒక సంవత్సరం పాటు ఒప్పంద ప్రాతిపదికన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వారి అధీనంలో పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. అందుకు సంబందించిన నియామకాలన్ని ప్రభుత్వం ఆదేశానుసారం వారు ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రమే జరుపుటకు నిర్ణయించడంజరిగింది. ఇప్పటికే నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చిన యెడల నిలపాలని కమీషనర్, హెల్త్ […]

WhatsApp Image 2024-02-18 at 7.27.55 PM Viral

కొల్లేరు అభయారణ్యం పరిధిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్…!!!

కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వన్య ప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ తెలిపారు. అందులో భాగంగా పైడిచింతపాడు, మల్లవరం, బొబ్బిలిలంక గ్రామాలలో పర్యటించడం జరిగిందన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలో ఎటువంటి అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు జరపకుండా పటిష్టమైన నిరోధక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఇప్పటికే […]