WhatsApp Image 2024-03-03 at 6.10.23 PM Viral

పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు […]

WhatsApp Image 2024-03-03 at 6.10.54 PM Exclusive

దేవాంగులకు ఒక్క సీటైనా కేటాయించాలి…

రాష్ట్రంలో 20 లక్షల జనాభా వరకు ఉన్న దేవాంగ సామాజికవర్గం పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని 50 శాతంకు పైగా చేనేతలు ఉన్న చీరాల శాసనసభ నియోజకవర్గంలో ఒక్క సీటైనా దేవాంగులకు కేటాయించాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ వైయస్సార్సీపి అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం నిమిత్తం విజయవాడ విచ్చేసిన పుచ్చల రామకృష్ణ ఒక ప్రకటన […]

WhatsApp Image 2024-03-03 at 6.05.29 PM Viral

నాణ్యమైన విద్యకు దూరం చేయబడుతున్నారు…!!!

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పిటిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-03-03 at 5.59.14 PM Political

ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు…

గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp Image 2024-03-03 at 5.55.14 PM Political

ఉమ్మడి నిర్ణయాన్ని గౌరవిస్తాం…

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల ఆనందరావుకి సీటీ ఇవ్వాల్సిందిగా వారు సూచించారు.

WhatsApp Image 2024-03-02 at 6.30.41 PM Political

కాకినాడ లో టీ.డీ.పీ. విస్తృత స్థాయి సమావేశం…

వై.సీ.పీ. ప్రభుత్వ అవినీతి, అరాచకం, దోపిడీ, డ్రగ్స్, రౌడీ, గూండా, కబ్జా పాలనను అంతమొందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శంఖారావం సూపర్ సిక్స్, భవిష్యత్తు గ్యారెంటీ, తదితర అంశాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వ అరాచక పాలనకు […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Exclusive

డి.ఎం.ఇ. కి వినతి పత్రం ఇచ్చిన శానిటేషన్ వర్కర్లు…

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సి.హెచ్. విజయ్ కుమార్, మాట్లాడుతూ… కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పి.ఎఫ్. ను కట్ చేసి యజమాని […]

WhatsApp Image 2024-03-02 at 4.41.18 PM Political

కాకినాడ రూరల్ సీటును శెట్టిబలిజలకే కేటాయించాలి…

కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులకే కేటాయించాలని శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు కాకినాడలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసం శెట్టి భీమరాజు, సేవా సంఘం ప్రధాన కార్యదర్శి […]

WhatsApp Image 2024-03-02 at 4.40.28 PM Exclusive

తీర ప్రాంత మత్స్యకారులందరికీ పరిహారం అందించాలి…

లీగల్ సర్వీస్ కమిటీ సూచన మేరకు తీర ప్రాంతంలో ఉన్న 69 గ్రామాలకే కాకుండా ఉప్పలంక, పగడాల పేట నుండి కోనపాప పేట వరకు ఉన్న మత్స్యకర గ్రామాలన్నింటికీ పరిహారం అందించాలని ది కాకినాడ మెరైన్ ఫిషర్మెన్ మల్టీపర్పస్ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు వరిపల్లి సత్యనారాయణ స్వామి తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకుగాను స్వామి కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… తీర ప్రాంతంలో 69 మత్స్యకార […]

WhatsApp Image 2024-03-02 at 3.59.32 PM Political

వై.సీ.పీ. కి షాక్ ఇచ్చన నెల్లూరు ఎం.పీ. …

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో వై.సీ.పీ. పార్టీ ఎం.పీ. టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలోకి చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన వందల మంది స్థానిక […]