రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ – తూర్పు గోదావరి జిల్లా – సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు మరమ్మత్తులకు చేపట్టడం కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాని ఆ పనులు ఇంకా జరుగుతుండడంతో నవంబర్ 10 వరకు ట్రాఫిక్ ను నియంత్రించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మరమ్మతులు దృష్ట్యా ప్రజలు సహకరించాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో ది. 27.09.2023 నుండి 26.10.2023 వరకు రోడ్ కం రైల్ వంతెన పై ట్రాఫిక్‌ను మళ్లించడానికి జిల్లా ఆర్ అండ్ బి అధికారి అభ్యర్థన చెయ్యడం జరిగిందన్నారు. ఇంకా పనులు జరుగుతున్న దృష్ట్యా నవంబర్ 10 వరకు ట్రాఫిక్ మళ్లింపు కోసం అభ్యర్థించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 10 వ తేదీ వరకు ఆర్.సి.ఆర్.బి పై పూర్తిగా ట్రాఫిక్ ను మళ్లించ్చనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 24 నుంచి బిటి రోడ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయి లో పెయింటింగ్ , రోడ్ మార్కింగ్ తదితర పనులను చేపట్టనున్న దృష్ట్యా నవంబర్ 10 వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నట్లు తెలిపారు.
రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం నవంబర్ 10 వరకు మూసివేత కొనసాగింపు…. కలెక్టర్ మాధవీలత
