ఏయులో వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు బోగస్ అని వైసిపి ఆరోపించటంతో కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయు సెంటర్ కు వెళ్ళేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయనను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యే లతో వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పరిశీలించారు.
ఏయులో వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆకస్మిక పరిశీలన…. -మాజీ మంత్రి శ్రీనివాసరావు-

