WhatsApp Image 2023-12-18 at 3.23.35 PM Viral

ప్రమాదంగా మారిన సామర్లకోట మేజర్ డ్రైన్ కల్వర్ట్…

సామర్లకోట పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో రథం షెడ్డు వద్దగల మేజర్ డ్రైన్ కల్వర్టు ప్రమాధ భరితంగా మారింది. కల్వర్ట్ కు రెండు వైపులా ఉన్న స్లాబ్ ను మున్సిపల్ అధికారులు ముక్కలుగా పగులగొట్టి వదిలేశారు. ఇది జరిగి మూడు రోజులు గడిచినా… అలాగే వదిలిపెట్టడంతో ఆ ప్రాంతంలో భారిగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహన దారులు ఆ మార్గంగుండా వెళుతూ శిధిల కల్వర్టు వద్ద అదుపు తప్పి పడిపోతున్నారు. […]

Sexual-Harassment-in-the-Workplace Viral

యూపీ లో మహిళ పై ధారుణం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రైవేట్ భాగాలపై పొరుగు ఇంటి వారు ఇనుప రాడ్ తో దాడి చేసారు. యూపీ లో షాజహాన్ పూర్ జిల్లా రామ్ చంద్ర మిషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటణ సంభవించింది. ఆ మహిళ పొరుగు ఇంటి సమీపంలో మూత్ర విసర్జన చేసిందని తనను కొట్టారని బాధితురాలు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందుతులను అదుపులోకు తీసుకొని కేసు నమొదుచేసారు. భాదితురాలిని సమీపంలో […]

WhatsApp Image 2023-12-17 at 6.47.43 PM Viral

పేకాట స్థావరంపై పోలీసుల దాడి…

లారీ స్టాండ్ ఆఫీసులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. పేకాట నిర్వహిస్తున్నారని అందిన సమాచారం ప్రకారం సామర్లకోట పోలీసులు సామర్లకోట పట్టణ పరిధిలో గల గాంధీనగర్ లారీ స్టాండ్ ఆఫీసులో ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసులు 8మందిని అరెస్ట్ చేసి కేసు నమోదుచేసారు.

WhatsApp Image 2023-12-17 at 2.27.26 PM Viral

సముద్రంలో గల్లంతయిన స్టూడెంట్…

మచిలీపట్నంలోని తాళ్ళపాలెం బీచ్ లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. నూజివీడుకు చెందిన ఐదుగురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మచిలీపట్నం సముద్రంలోకి దిగి కొట్టుపోయారు. నీటిలోకి దిగి సముద్ర అలలను ఆస్వాదిస్తున్న విద్యార్ధులు అక్కడ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. అది గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి నలుగురిని కాపాడారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. సముద్రంలో గల్లంతయిన యువకుని పేరు అఖిల్ గా పోలీసులు తెలిపారు.

WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM Viral

కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-

మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి  కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. […]