WhatsApp Image 2023-11-01 at 8.43.31 PM Political

గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి… -కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు-

నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కొమరగిరి లేఔట్ లో చేస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో గృహ నిర్మాణ ప్రగతి పై సమీక్షించారు. కార్పొరేషన్, హౌసింగ్, మెప్మా విభాగాలకు చెందిన అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గృహ నిర్మాణ లక్ష్యాలను అధిగమించేందుకు స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి […]

IMG-20231031-WA0018 Trending News

కాకినాడ జిల్లా డీపీవో గా భారతి సౌజన్య…

కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి(డీ.పీ.వో.)గా నూతనంగా నియమితులైన కే. భారతి సౌజన్య  జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాకినాడ, కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియలను మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గ్రూప్-1 పరీక్షలో డీ.పీ.వో. గా ఎంపికైన భారతి సౌజన్య నెల్లూరు జిల్లాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా డీ.పీ.వో. గా ఆమెను […]

IMG-20231031-WA0010 Trending News

తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరందక 31 వేల ఎకరాలకు నష్టం… -టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెహ్రూ-

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించి 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం కలిగిందని తక్షణమే ఆ పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) వినతిపత్రాన్ని అందించారు. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరుకు సంబంధించి ప్రెజయిర్ పాడవడం వల్ల సాగునీరు సరఫరా జరగలేదన్నారు. ఈ సమస్యను తాను […]

WhatsApp Image 2023-10-30 at 9.44.15 PM Crime

బియ్యం వ్యాపారి హత్య కేసులో ముద్దాయి అరెస్ట్…

సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామంలో బియ్యం వ్యాపారి జల్లిగంపల తాతబ్బాయి హత్య కేసుకు సంబంధించి ముద్దాయి అదే గ్రామం సాలిపేటకు చెందిన తలాటం రాంబాబు(50) ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సీ.ఐ కే. దుర్గా ప్రసాద్ అందించిన వివరాల ప్రకారం బియ్యం వ్యాపారి అతనికి రావాల్సిన బాకీల వసూలు విషయమై గ్రామంలో ఇంటినుంచి బయటకు వెళ్లగా అదే గ్రామంలో ఉంటూ చెడు వ్యసనాలకు గురైన తలాటం రాంబాబు అనేవ్యక్తి వ్యాపారి తాతాబ్బాయిని అతని ఇంటిలోనికి తీసుకువెళ్ళి […]

WhatsApp Image 2023-10-30 at 8.34.18 PM Crime

నేరాల అదుపులో భాగస్వాములు కండి…. -అవగాహన సదస్సులో డి.ఎస్.పీ.-

సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల అదుపునకు గానూ వ్యాపారులు, ప్రజలు వారి వ్యాపార స్యలాల్లో, గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజలు, వ్యాపారులు పూర్తిగా భాగస్వాములు కావాలని పెద్దాపురం డిఎస్పి లతా కుమారి అన్నారు. సామర్లకోట పట్టణ పరిధిలోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులకు సీసీ కెమెరాల ఆవశ్యకత తెలిపేందురు కార్యక్రమాన్ని నిర్వహించారు. సీ.సీ.ఎస్.ఐ. అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీ.ఎస్.పీ.  లతాకుమారి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. […]

IMG_20231030_161302 Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. భానుగుడి పోలీసు కన్వెన్షన్ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో పోలీసు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు , మహిళా పోలీసులకు బీపీ, డయాబెటిక్, కార్డియాలజీ, గైనెకాలజీ సంబంధిత పరీక్షలను మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో […]

IMG-20231028-WA0016 Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం, ఆదిత్యా విద్యాసంస్థల  ఆధ్వర్యంలో సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ అనే అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు  నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జిల్లా అడిషనల్ ఎస్పీ (పరిపాలన) పి. శ్రీనివాస్ ఈ పోటీలను పరిశీలించారు. విద్యార్థులకు “లైంగిక వేధింపుల నుండి మహిళలు, […]

IMG-20231028-WA0015 Political

ప్రభుత్వం నిత్యవసర వస్తు ధరలను నియంత్రించలేకపోతోంది – కాకినాడ జిల్లా బీజేపీ నాయకులు-

నిత్యవసర వస్తువుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేక పోతోందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా కమిటీ దుయ్యబట్టింది. దరల పెరుగుదలపట్ల అన్ని వర్గాలల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ అభిప్రాయబడింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ కుమార్ అధ్యక్షతన పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అంశంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సమావేశం తీర్మాణించింది. ఉద్యోగులకు జీతాలు లేవని, నిరుద్యోగం రోజురోజుకీ పెరిగిపోతోందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని, […]

IMG-20231026-WA0016 Crime

టిప్పర్ను ఢీకొని యువకుడు మృతి…

కాకినాడ జిల్లా లో పెద్దాపురం మండలం పులిమేరు శివారులో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో గొల్లపల్లి సుకుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

1000041012 Kakinada

శ్రీనగర్ సదస్సుకు కమిషనర్ నాగ నరసింహారావు…

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న స్మార్ట్ సిటీల వర్క్ షాప్ లో పాల్గొనేందుకు కాకినాడ స్మార్ట్ సిటీ సీ.ఈ.ఓ., మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. నాగ నరసింహారావు వెళ్లారు. బహిరంగ ప్రదేశాలను ప్రజలకు ప్రయోజనకరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం, సైకిల్ 4 చాలెంజ్, ఈట్ స్ట్రీట్ ల అభివృద్ధి వంటి అంశాలపై ఈ సదస్సు జరుగుతుందని తెలియచేశారు. దేశం లోని వివిధ స్మార్ట్ సిటీ ల నుంచి ప్రతినిధులు […]