74884490 Future

ఇస్రో శాస్త్రవేత్తలపై పవన్ వ్యాఖ్యలు…

భారతదేశ వాతావరణ పరిశోధనకు దోహదపడే అధునాతన ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. చంద్రయాన్-3 తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్ ను దించి, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను సంధించి విజయం సాధించిన ఇస్రో సంస్థ అదే పరంపరలో ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణమని అన్నారు. ఇన్సాట్-3 డీ.ఎస్ […]

hqdefault (1) Exclusive

ఆధ్యాత్మిక శోభతో విరిసిల్లిన కోరుకొండ …

కొత్త ఆలయాలను నిర్మించడం కంటే ఉన్నవాటికి నూతనత్వం కల్పించి పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అవసరమని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. కోరుకొండ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన పలు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర బీ.సీ. సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. ముందుగా మధురపూడి ఎయిర్ […]

WhatsApp Image 2024-02-18 at 1.49.22 PM Culture

అభివృద్ధికి నోచుకోని అమలేశ్వరస్వామి మడుగు…

హిందూ సంప్రదాయాలకు, పుష్కర స్తానలకు పేరుగాంచిన అమలేశ్వర స్వామి మడుగు అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకుండా అన్యాక్రాంతమవుతుందని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి ఆవేదన వ్యక్తంచేశారు. మూడు గ్రామల చిందాడగరువు, రోళ్లపాలెం, కామనగరువు పంచాయతీల పరిధిలో గల అమలేశ్వర స్వామి మడుగు 14 ఎకరాలు చెరువును 10 ఎకరాలు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఆర్.డబ్ల్యూ. ఎస్ చేరువుగా ప్రజాప్రతినిధులు మార్చారంటూ కామేశ్వర మహర్షి అన్నారు. రికార్డులు ప్రకారం 8 ఎకరాలు అంటున్నా అధికారులు ప్రస్తుతం కనిపించేది […]

17-alamuru1 Exclusive

పారిశ్రామిక వేత్త పాపారావును సన్మానించిన గ్రామ పెద్దలు…

తూర్పూ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో సీతారామ ఆలయ వార్షకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వ్యాపారవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఉత్సవ కమిటీకి రూ. 40 వేల రూపాయిలు విరాళంగా అందించారు. అనంతరం స్వామివారిని దర్శంచినారు. తొలత గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పూల మాలలు వేసి షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-02-17 at 8.54.18 PM Exclusive

రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి…

కాకినాడ జిల్లాలో రైతుల సమస్యలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.వి.ఎస్. ఘోరీ స్పందించారు. సామర్లకోట మండలం వి.కె. రాయపురం, మామిళ్లదొడ్డి ప్రాంతాల్లో సాగునీటి ఎడ్డది గల పంట పొలాలను ఆమె పరిశీలించారు. సాగునీరు అందక నష్టపోతున్నామాంటూ కౌలు రైతులు పురుగు మందు సీసాలతో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారులు ఇబ్బంది ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు నమోదు చేసుకున్నారు. సమస్యలన్నీ […]

Andhra-govt-employees-threaten-strike-over-pay-revision Trending News

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి…

ప్రభుత్వం నుండి ఉద్యోగుల డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేనందున ఈ నెల 20వ తేదిన భారీ ఎత్తున మహా ధర్నా మరియు ర్యాలి జరపబడునని కావున భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు , పెన్షన్నర్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుములల నుండి రావాలని ఏ.పీ. జె.ఎ.సి. రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.పీ. జే.ఏ.సీ. ఛైర్మన్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన […]

OIP (4) Exclusive

యధావిధిగా గ్రూప్ 2 పరిక్షలు…

గ్రూప్ 2 పరిక్షలు యధావిధిగా ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతాయని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రూప్ 2 వాయిదా వేయించాలని ఏ.పీ. పీఎస్సీ సభ్యులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి శదవిదాలు ప్రయత్నించామని అన్నారు. అయితే పరిక్షలు వాయిదా వేస్తే ఆరు నెలల వరకు మళ్లీ పరీక్ష పెట్టే పరిస్థితి లేదని ఏ.పీ. పీఎస్సీ సభ్యులు తేల్చి చెప్పారన్నారు. కావున ఉన్న […]

hqdefault Viral

కడప చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

రాజంపేట కడప చెన్నై ప్రధాన రహదారి పంజాబీ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీ కొన్ని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ స్థానికులు సమాచమివ్వడంతో మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న రెండు మృత దేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి […]

WhatsApp Image 2024-02-17 at 2.16.24 PM Viral

సామర్లకోట రిగేషన్ లాకు వద్ద రైతుల ధర్నా…

పంట పొలాలకు నీరు రాకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం పంటకు నీరు రాకపోవడం వల్ల ఈ రోజు ఉదయం 10 గంటలకు సామర్లకోట మండలం వి.కే. రాయిపురం ఇరిగేషన్ లాకుల వద్ద నిరసన వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో ఉండూరు, సర్పవరం, వి.కె. రాయిపురం, గంగనాపల్లి, కొవ్వాడ, రామేశ్వరం, తదితర గ్రామాల రైతులు ధర్నా చేయుటకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. అనంతర రైతులందరూ వచ్చి రోడ్డుమీద ధర్నా నిర్వహించి చేతుల్లో మందు […]

Electric-Shock Viral

కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బ్రౌన్ పేటకు చెందిన చెక్క ఆనంద్ కుమార్ కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆనంద్ కుమార్ విద్యుత్ స్తంభంపై షాక్కు గురై కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు […]