ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేయాలి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో ఇచ్చిన కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. […]









