1000039995 News

8000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్‌

 రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం పోర్టు తొలిదశను 2023 డిసెంబరు నాటికి పూర్తిచేయాలనే సంకల్పంతో పనులు జోరందుకున్నాయి. జూన్‌ 2022 లో నవయుగ, అరబిందో కంపెనీలు రూ.2,634.65 కోట్లతో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వాస్తవానికి రూ.3,736 కోట్ల వ్యయంతో 850.79 ఎకరాల విస్తీర్ణంలో 34.04 టన్నుల సామర్థ్యం […]

తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం

23న మధ్యాహ్నం 3 గంటలకు మంజీరా హోటల్‌లో నాయకుల బేటీ 2024లో జరుగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం – జనసేన పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో జనసేన పార్టీ అధినేత, వర్థమాన సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీతో చర్చలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీలో ఎవరు ఉండాలన్నది కూడా పూర్తవడంతో ఇరుపార్టీల ముఖ్యులతో సమావేశానికి విదయ దశమి పర్యదినం ముహూర్తంగా నిర్ణియించారు. రాజమండ్రిలోని మంజీరా […]

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లెటర్‌పై దుమారం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసినట్టుగా చెబుతున్న లెటర్‌పై పెద్ద దుమారం రేగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన లెటర్‌ను రాశారంటూ ఒక సందేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దాని సారాంశమేమనగా… నేను జైలులో లేను, మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నను. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మద్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల నా […]

ఎల్ హెచ్ ఎం ఎస్ కెమెరాలు ఉపయోగించడం పట్ల పోలీసుల విస్తృత ప్రచారం

కాకినాడ జిల్లాలో దొంగతనాలను నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌ కుమార్‌ ఆదేశానుసారం కాకినాడ క్రైమ్ డిఎస్పి రాంబాబు సూచనల మేరకు ఎల్ హెచ్ ఎం ఎస్ (Locked House Monitoring System) కెమెరాలు ఉపయోగించడం పట్ల పోలీసులు ఆటోలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా అరికట్టడంతో పాటు దొంగలను సులువుగా పట్టుకునేందుకు వీలవుతుందని పోలీసులు అవగాహణ కల్పిస్తున్నారు. ఎవరైనా తమ ఇంటికి తాళం వేసి దూర ప్రయాణాలకు వెళ్లే సమయంలో సంబంధిత పోలీస్ […]

వివాహిత అనుమానాస్పద మృతి

కాకినాడ మాధవ్ నగర్ వీధిలో పనిచేస్తున్నసామర్లకోటకు చెందిన వరలక్ష్మి (36) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒక ఇంట్లో పనిచేస్తున్న ఆమె అదే ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటన శనివారం జరుగగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోనికొచ్చింది. మృతురాలి బంధువులు యజమాని ఇంటి వద్ద ఆందోళనకు పూనుకున్నారు. ఇంటి యజమాని కొట్టి చంపినట్లు బంధువులు ఆరోపణల నేపద్యంలో సంఘటన స్థలానికి చేరుకొని సర్పవరం పోలీసులు కేసు సంఘటనపై ఆరా తీస్తున్నారు.

అల్లూరి జిల్లాలో దారుణం… అంబులెన్స్‌ లేదు

అంబులెన్స్ సదుపాయం లేకపోడంతో శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన బందువులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన కిముడు అద్దన్న అనే వ్యక్తి ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. అతడిని హుటాహుటిన కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తరలించారు. వైద్యలు పరీక్షించి అప్పటికే అద్దన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ కావాలని సిబ్బందిని అడగ్గా వారు నిరాకరించారని బాధితులు వాపోయారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని భుజాలపై మోసుకొని గ్రామానికి తరలించారు.

ప్రతీ ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న సేవలు ప్రజలందరికీ చేరువయ్యేలా ప్రజారోగ్య సిబ్బంది దృష్టిపెట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు కోరారు. స్థానిక స్మార్ట్‌సిటీలో ఈ అంశంపై ఎంహెచ్‌వో డాక్టర్‌ ఫృద్వీచరణ్, మెడికల్‌ ఆఫీసర్లు, ఎఎన్‌ఎంలతో శనివారం సాయంత్రం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్క గృహయజమాని ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం […]

News

పంచాయితీ అధికారులపై సర్పంచ్‌ ఆగ్రహం

రవాణాశాఖా మంత్రి పినిపే విశ్వరూప్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను సమనస పంచాయితీ అధికారులు తొలగించడం వివాదానికి దారితీసింది. మంత్రి కార్యక్రమం ముగియకుండానే బ్యానర్లను ఎందుకు తొలగించాని పంచాయితీ సర్పంచ్‌ పి శ్యామ్‌ కుమార్‌ సంబందిత సిబ్బందిని నిలదీశారు. అయితే వారు పొంతనలేని సమాదానాలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అధికార పార్టీలో అంతర్గత రాజకీయ పరిణామాలకు ఇది తార్కాణమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు

నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తల బట్టలిప్పించిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా తెలుగుదేశం జండాలతో సైకిల్ యాత్ర చేస్తున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరుడు పుంగనూరు వైఎస్‌ఆర్‌సీపీ స్థానిక నాయకుడు సూరి నడిరోడ్డుపై బట్టలిప్పించి, టీడీపీ జెండాని కాలుతో తొక్కుతూ తిడుతున్న సంఘటన తీవ్ర చర్చానీయాంశంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుచరులు పసుపు రంగును చూస్తే తట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు.

OIP Kakinada

గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు

తాళ్లరేవు మండలం గోపులంక గ్రామ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కోరంగి సబ్‌ ఇనస్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి తణుకు గ్రామామం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఏడుగురు యువకులు దసరా సెలవుల నిమిత్తం విహార యాత్రకు పయనమయ్యారు. వీరిలో కొందరు బీటెక్‌ చదువుతుండగా మరికొందరు డిగ్రీ వరకూ చదివారు. కాగా గోదావరి స్నానానికి గోపులంక గ్రామం సమీపంలో దిగి గోదావరి నదికి […]