అంబులెన్స్ సదుపాయం లేకపోడంతో శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన బందువులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కొండపడకు చెందిన కిముడు అద్దన్న అనే వ్యక్తి ఆదివారం అస్వస్థతకు గురయ్యాడు. అతడిని హుటాహుటిన కుటుంబ సభ్యులు సీహెచ్సీకి తరలించారు. వైద్యలు పరీక్షించి అప్పటికే అద్దన్న మృతి చెందినట్లు నిర్దారించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ కావాలని సిబ్బందిని అడగ్గా వారు నిరాకరించారని బాధితులు వాపోయారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని భుజాలపై మోసుకొని గ్రామానికి తరలించారు.
- Spy News
- 22 October 2023
- 0 Comments
- 101 Views
