OIP (5) Andhra Pradesh

రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం నవంబర్ 10 వరకు మూసివేత కొనసాగింపు…. కలెక్టర్ మాధవీలత

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ – తూర్పు గోదావరి జిల్లా – సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లు  మరమ్మత్తులకు చేపట్టడం కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 26 వరకు ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాని ఆ పనులు ఇంకా జరుగుతుండడంతో నవంబర్ 10 వరకు ట్రాఫిక్ ను నియంత్రించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. మరమ్మతులు దృష్ట్యా […]

images (13) Political

ఏయులో వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఆకస్మిక పరిశీలన…. -మాజీ మంత్రి శ్రీనివాసరావు-

ఏయులో వున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు బోగస్ అని వైసిపి ఆరోపించటంతో కాదని నిరూపించేందుకు పలుమార్లు ఏయు సెంటర్ కు వెళ్ళేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయనను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా టీడీపీ ఎమ్మెల్యే లతో వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను […]

IMG_20231026_103335 Andhra Pradesh

గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదం….

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో విషాదఘటన చోటుచేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనీయాల్సిన తల్లి, కడుపులో బిడ్డతో పాటు కనుమూసింది. నిండు గర్భిణీ మృతిపై కుటుంభ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డ మరణించిందని ఆరోపిస్తూ కుటుంభ సభ్యులు నిరశనకు పూనుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం … బొండపల్లి మండలం గొల్లుపాలెం గ్రామానికి చెందిన గొల్లు ఉష (28) 8వ నెల గర్భిణీ. ఆమెకు పిట్స్ రావడంతో గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి […]

IMG-20231026-WA0016 Crime

టిప్పర్ను ఢీకొని యువకుడు మృతి…

కాకినాడ జిల్లా లో పెద్దాపురం మండలం పులిమేరు శివారులో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో గొల్లపల్లి సుకుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

1000041012 Kakinada

శ్రీనగర్ సదస్సుకు కమిషనర్ నాగ నరసింహారావు…

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న స్మార్ట్ సిటీల వర్క్ షాప్ లో పాల్గొనేందుకు కాకినాడ స్మార్ట్ సిటీ సీ.ఈ.ఓ., మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్. నాగ నరసింహారావు వెళ్లారు. బహిరంగ ప్రదేశాలను ప్రజలకు ప్రయోజనకరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడం, సైకిల్ 4 చాలెంజ్, ఈట్ స్ట్రీట్ ల అభివృద్ధి వంటి అంశాలపై ఈ సదస్సు జరుగుతుందని తెలియచేశారు. దేశం లోని వివిధ స్మార్ట్ సిటీ ల నుంచి ప్రతినిధులు […]

WhatsApp Image 2023-10-25 at 7.03.13 PM Andhra Pradesh

దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణాసంచా విక్రయాలను అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను కోరారు. కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులతో రానున్న నవంబరు 12వ తేదీన జరుపుకోనున్న దీపావళి పండుగ ఏర్పాట్ల పర్యవేక్షణపై ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2023-10-25 at 7.00.00 PM Education / Career News

ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఐబీ’ సిలబస్ కు రోడ్ మ్యాప్ సిద్ధం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ ప్రవేశ పెట్టేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. ఐబీ భారతదేశ విభాగం ఇంఛార్జ్ బాలకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎమీ పార్కర్, గ్లోబల్ డైరెక్టర్ బిజినెస్ డెవలప్ మెంట్ బన్నయాన్ లతో ప్రవీణ్ ప్రకాశ్ భేటీ అయ్యారు. 10,12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు. సిలబస్ […]

th Education / Career

పాఠ్య పుస్తకాల్లో భారత్ అనే పేరును ముద్రించనున్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్…

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇంస్టీట్యూట్ (NCERT) ఇండియా పేరు మార్చడం పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఇకనుంచి ప్రింట్ చేసే ప్రతీ పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ అనే పేరును ముద్రించనున్నట్లు తెలియజేసింది. ప్యానల్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సభ్యులు ఇస్సాక్ తెలిపారు.

WhatsApp Image 2023-10-25 at 6.22.16 PM News

డిసిసి బ్యాంక్లో సమాచారం లేక వేలం పాట రద్దు…

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో వేలం పాటను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటకు సంబంధించిన వివరాలను డిసిసి బ్యాంక్ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేశారు. మండపేటలోని విజయ మహాల్ ఎదురుగా ఉన్న ఎకరం 33 సెంట్లు స్థలమును అందులో ఉన్న భవనాలకు వేలం పాటను నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2023-10-25 at 5.22.45 PM Political

సీ.పీ.ఎం. రక్షణ బేరి యాత్రను జయప్రదం చేయాలి… సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ పిలుపు

లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సీ.పీ.ఎం. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా రక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జి, కె.ఎస్. శ్రీనివాస్, జి. బేబీ రాణి తదితరులుతో కలిసి పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… బీజేపీ పాలనలో మొత్తం దేశమే […]