Exclusive

ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేయాలి…

OIP (27)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజా గళం బహిరంగ సభలో పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి అడగడుగునా కనిపించింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా ప్రధాని పాల్గొన్న సభలో ఇచ్చిన కీలక పాసుల మీద కనీసం ఎవరి పేరు మీద జారీ అయిందో వారి పేరుగానీ, వివరాలు లేకుండానే ఖాళీవి జారీ చేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. ఇది పోలీసుశాఖ, జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదమని అన్నారు. సభ జరుగుతున్న సమయంలోనూ భద్రతా వైఫల్యాలు, జనాన్ని కంట్రోల్ చేసే చర్యలు ఎక్కడా పోలీసు శాఖ చేపట్టలేదని చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామనని చెప్పారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని సభలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి పాల్గొన్న సభలో ఇంతటి తీవ్రమైన తప్పిదాలు ఎప్పుడూ జరగలేదదని అన్నారు. సభా ప్రాంగణం అంతా పోలీసుల చేతిలోనే ఉన్నప్పటికీ వారు మాత్రం పట్టన్నట్లు వ్యవహరించారన్నారు. దీంతోనే పదేపదే సభకు అంతరాయం కలిగింది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.