Viral

సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు…

WhatsApp Image 2024-01-14 at 4.18.59 PM

తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసారు. వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌ తయారుచేసారు. అర్చకులు సీ.ఎం. దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీ.ఎం. కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వీ. సుబ్బారెడ్డి, ఎం.పీ. నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.