ముఖ్యమంత్రి నూతనంగా ప్రవేసి పెట్టిన భూ యాజమాన్య చట్టాని రద్దు చేయాలని కొరుతూ సీ.పీ.ఐ. జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆనంద నగర్ వద్ద బోగి మంటల్లో స్థిరాస్తి కలిగిన రైతాంగానికి నష్టం కలిగించే చట్టం ప్రతులను సీ.పీ.ఐ. శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సీ.పీ.ఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ… ఈ చట్టం భూ కబ్జాదారులుకు ఊతం ఇచ్చేలా వుందని అన్నారు.
న్యాయ స్థానాల్లో భూ వివాదాలు పెరిగిపోతున్నయానీ సాకుతో రాజ్యాంగం విరుద్ధమైన చట్టన్ని తీసుకురావడం దారుణమన్నారు.ఈ చట్టం అమలు పై పునరోలచన చేయాలని మధు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్న మోడీ , జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని వచ్చే సంక్రాంతి కి ఇంటికీ పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీ.పీ.ఐ. నాయకులు నాగేశ్వరావు, కొండవతి శ్రీనువాస రావు, దుర్గమ్మ తదితరులు పాల్గున్నారు.

