విశాఖకు విచ్చేసిన కేంద్ర ,రాష్ట్ర బీ.జే.పీ. మంత్రులకు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కి ఏ.పీ. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్, పీ.వీ. కృష్ణారావు గజమాలతో స్వాగతం పలికారు. విశాఖను భారతదేశంలో ముఖ్యమైన నాలుగు నగరాలలో ఒకటిగా ఎంపిక చేసి అతి ముఖ్యమైన నగరంగా అభివృద్ధి చేసేందుకు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈరోజు విశాఖకు విచ్చేసిన నాయకులకు డైమండ్ పార్క్ వద్ద క్రేన్ తో గజమాల తో సత్కరించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… త్వరలోనే వాల్తేరు డివిజన్ తో కూడిన పూర్తిస్థాయి రైల్వే జోన్ ఇవ్వాలని, దీని ద్వారా స్థానికులకు ఆర్టికల్ 371 డి ద్వారా 75% రిజర్వేషన్ ఉద్యోగాలలో వస్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక తరగతి హోదా కేటాయించాలని, విభజన హామీలన్నీ అమలు చేయాలని, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో తక్షణమే ఉపకులపతిని నియమించాలని, సంవత్సరాలు తరబడి రోజు కూలీకి పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.

