Kakinada

వృద్ధుల కోసం వివేకానంద విగ్రహం గేటును తెరావాలి…

fjfjfjfjff;'

కాకినాడ నగరంలో కుళాయి చెరువుపార్కు ఆవరణ లోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం వద్ద జవహర్ వీధిగేటు, బాదంవారి వీధిలో కరెంటు కార్యా లయం ప్రక్కనున్న గేటు, పార్కు వేళల ప్రకారం తెరిపించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. కాకినాడ కలెక్టరేట్ ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆర్.డి.ఓ. ఇట్ల కిషోర్ కు పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు వినతీపత్రం అందజేశారు.

కరోనా సమయంలో మూసివేసిన జవహర్ వీధి గేటు తెరవకపోవడం వలన స్థానిక వృద్దులు వివేకాపార్కు ప్రయోజనం పొందలేకపోతున్నారని అన్నారు. చుట్టూ తిరిగి అరకిలో మీటరు దూరం లోపలికి బయటికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్కు వేళలు తెల్లవారుజామున 4 నుండి ఉదయం10 వరకు సాయంత్రం 4 నుండి 8 వరకు పొడిగించాలన్నారు. పోటీ పరీక్షల కోసం చదువుకునే వారికి ప్రవేశం ఇవ్వాలని తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ