Political

రజకుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -వనమాడి కొండబాబు-

WhatsApp Image 2024-03-01 at 6.14.10 PM

కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రజకుల సంక్షేమం, రజకుల భవిష్యత్తుకు ప్రణాళిక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీ.సీ. కులాలకు ఆదరణ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునే వర్గాల వారికి సామాగ్రి పనిముట్లు అందించారన్నారు.

రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ బాక్సులు, సబ్సిడీపై అందించి వారిని ఆదుకోవడంతో పాటు సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల్ల బాబురావు, గొలితు సత్యనారాయణ, నరం శ్రీనివాసరావు, అనకాపల్లి గణేష్ రావు, ర్యాలీ రాంబాబు, సీల అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.