రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకం అవ్వాలని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ప్రజలు తిరస్కరించిన సి.ఎ.ఎ. ను మరలా తీసుకువచ్చిందని విమర్శించారు.
కాకినాడ సుందరయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లా సమావేశం కన్వీనర్ అయితా బత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చడానికే అధికారంలోకి వచ్చామని బీ.జే.పీ. మంత్రులు మాట్లాడతారని కానీ నరేంద్ర మోడీ రాజ్యాంగం చాలా గొప్పదని మాట్లాడుతారని అన్నారు.
ఈ రకమైన ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసగిస్తూ మెజారిటీ హిందువుల ఓట్లను కొల్లగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని వక్తలు విమర్శించారు. తరతరాలుగా భారతదేశంలో నివసిస్తూ స్వాతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ముస్లింలను మైనార్టీలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలని రహస్య జెండాతో పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగానే సి.ఎ.ఎ. ను తీసుకువచ్చి ప్రజల మధ్య విభజన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుందని నాయకులు విమర్శించారు. ఇలాంటి బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా చేయాల్సిన అవసరం మొత్తం భారత ప్రజానీకానికి ఉందని పిలుపునిచ్చారు.

