కాకినాడ జిల్లా కాకినాడ నగరలోని పాలక సంస్థలో ప్రగతి అజెండా రూపకల్పన కోసం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు ప్రముఖులతో అఖిలపక్షం నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు వినతిపత్రం దాఖలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు ప్రత్యేక కార్యదర్శిగా వున్న ముద్దాడ రవిచంద్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా వున్న సమయంలో కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా అఖిల పక్షం నిర్వహించారన్నారు. అదేవిదంగా సగిలి షాన్ మోహన్ స్పెషల్ ఆఫీసర్ గా నగర భవిష్యత్ పై ప్రగతి అజెండా నిర్వహణ కోసం కార్పోరేషన్ లో అఖిల పక్షం నిర్వహించాలని కోరారు.
కాకినాడ లో ప్రగతి అజెండా రూపకల్పన కోసం కృషిచేయాలి…

