Kakinada

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లు నమోదు… -జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా-

krutika-shukla

కాకినాడ జిల్లాలో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయినట్టు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 తుది జాబితాను సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ జిల్లా ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలోని 1,637 పోలింగ్ కేంద్రాల్లో 15,99,065 మంది ఓటర్లుగా నమోదు అయ్యాయన్నారు. ఇందులో 7,88,105 మంది పురుష ఓటర్లు, 8,10,781 మంది స్త్రీ ఓటర్లు, 179 మంది ఇతరులుగా ఉన్నారని ఆమె వివరించారు.
అక్టోబర్ 27న ప్రచురించిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి మొత్తం కాకినాడ జిల్లాలో 15,89,755 మంది ఓటర్లుగా నమోదు కాగా అందులో 70,478 మందిని అదనంగా వాటర్లుగా నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇందులో 11,510 మంది చనిపోయారని, 41,958 మంది వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారన్నారు. 7,700 మంది డబుల్ ఓటర్లుగా గుర్తించగా 61,168 మంది ఓటర్లను తొలగించడం జరిగిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-20 at 4.43.33 PM
Kakinada

బాల్యవివాహాలను సమూలంగా నిర్మూలిద్దాం… నగరపాలక సంస్థ కమిషనర్ నాగ నరసింహారావు వెల్లడి…

బాల్య వివాహాల నిషేధిత చట్టం – 2006 ను మరింత పటిష్టవంతంగా అమలు చేయడంలో ఆయా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ