Telangana

హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం అధికారులతో రేవంత్‌రెడ్డి సమావేశం…

revanth

తెలంగాణను మచిలీపట్నం పోర్టును కలిపే హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌.హెచ్‌.ఏ.ఐ. చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణకు తీరప్రాంతం లేకపోవడంతో డ్రై పోర్ట్‌ను నిర్మించాలని యోచిస్తున్నామని కనెక్టివిటీ కోసం ఎక్స్‌ప్రెస్‌వే అవసరమని ఆయన చెప్పారు. ఎన్‌.హెచ్‌.ఏ.ఐ. సభ్యుడు అనిల్ చౌదరి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ముఖ్యమంత్రి కార్యదర్శి షానవాజ్ ఖాసీం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో