హైదరాబాద్ నగరంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి రేపిడోను బుక్ చేసుకున్నాడు. రేపిడో వచ్చి ఆ వ్యక్తిని పిక్ చేసుకుంది. అయితే వెళ్తున్న దారిలో బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో మార్గం మధ్యలోనే ఆగిపోయింది. రాపిడో డ్రైవర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ని కోరాడు. కాని అతను నిరాకరించడంతో ఏంచెయ్యాలో తెలియక అతన్ని తన బైక్ మీద కుర్చోబెట్టకొని నెట్టుకుంటూ పెట్రోల్ బంక్ వరకూ వెళ్లాడు.
హైదరాబాద్ లో వింత ఘటన… బైక్ దిగని కస్టమర్…!!!
