కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్, జూన్ 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి నాల్గవ వ్యక్తి, భారతీయ జాతీయుడు కూడా అరెస్టయ్యినట్లు అధికారులు వెళ్లడించారు. ఈ విషయాన్ని తన అధికారిక విడుదలలో పేర్కొంది. సంబంధం లేని కేసులో తుపాకీ ఆరోపణల కోసం అతను ఇప్పటికే అంటారియోలోని పీల్ ప్రాంతీయ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సాక్ష్యాధారాలను వెతుకుతున్నామని, అమన్‌దీప్ సింగ్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య, హత్యకు కుట్ర కింద అభియోగాలు మోపడానికి బిసి ప్రాసిక్యూషన్ సర్వీస్ కోసం తగిన సమాచారాన్ని పొందామని పోలీసు ప్రకటనలో తెలిపారు. గత వారం రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు ఈ కేసుకు సంబందించిన నిందితులు కరణ్ బ్రార్, కమల్‌ప్రీత్ సింగ్, 28 ఏళ్ల కరణ్‌ప్రీత్ సింగ్‌లను కస్టడీలోకి తీసుకున్నారు. ఎడ్మంటన్ నివాసితులు, భారతీయ పౌరులందరిపై కూడా ఫస్ట్-డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నారని అభియోగాలు మోపారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు న్యూ అప్ డేట్…

