కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి దాతలు సమకూర్చిన హ్యెట్స్, గ్లూకోజ్, గగూల్స్, పేస్ట్, వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహిచారు. కార్యక్రమానికి ట్రాఫిక్-2 సీ.ఐ. చైతన్య కృష్ణ అద్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్’ ముఖ్యఅతిధిగా విచ్చేసారు. దాతలు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, శ్రీదుర్గాసోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు రాజ్ కుమార్, తదితరులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎస్.పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ… ఎండనక వాననక నిత్యం ప్రతికూల వాతావరణంలో వీధుల నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుండి తమను తాము కాపాడుకునేందుకు అవసరమైన హ్యట్స్ తోపాటు గ్లూజ్, గగూల్స్, వాటర్ బాటిల్ నెఫ్కీన్లను అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.పి. అడ్మిన్ ఎం.జె.వి. భాస్కరరావు, ఎ.ఆర్. అడిషినల్ ఎస్.పి. సత్యనారాయణ, డి.ఎస్.పి. శ్రీనివాసరావు, ఎస్.బి.డి.ఎస్.పి. శ్రీరామకోటేశ్వరరావు,తదితర సిబ్బంది పాల్గొన్నారు.
హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు… -ఎస్.పి. సతీష్ కుమార్-

