2024 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 290 స్థానాల్లోను పోటీ చేయాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. జరిగిన అలయన్స్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొత్తుల రూపొందించే బాధ్యత కలిగిన కమిటీ అధికారికంగా తన సమగ్ర నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు సమర్పించనుంది. ఇందులో భాగంగానే ఖర్గే జనవరి 4న కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి, సీట్ల పంపకాలను ఖరారు చేసేందుకు అన్ని రాష్ట్ర అధ్యక్షులు, సీఎల్పీ (కాంగ్రెస్ శాసనసభా పక్షం నేతలతో సమావేశమవుతారని వర్గాలు తెలిపారు.
స్వతంత్రంగా 290 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ…

