
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకి హైకోర్టు ఊరట కల్పించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మద్యంతర బెయిల్పై రాజమండ్రి కేంద్ర ఖారాగారం నుంచి బయటకు వచ్చిన ఆయనకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. సోమవారం జరిగిన వాదోపవాదాల అనంతరం హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, తెలుగుదేశం, జనసేన నాయకులకు గొప్ప ఊరట లభించినట్టైంది.

