Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధియేటర్ యాజమాన్యాల ప్రతినిధులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ… ప్రదర్శనలకు ఆమోద యోగ్యమైన సినిమాలకు చెంది ప్రభుత్వం అనుమతించడం జరుగుతుందని వాటిని మాత్రమే సినిమా హాల్లల్లో ప్రదర్శించాలి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సినిమాలు ప్రదర్శించే ధియేటర్ లకు ఏ.పి. ఎఫ్.టి.టి.డి.సి. కి ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి, ఏ బకాయిలు లేవని నిరంభ్యంతర ధృవ పత్ర పొందాల్సి ఉంటుందన్నారు.
ఆక్రమంలో ధియేటర్ ల నిర్వహణ, వసతుల కల్పనకు చెంది నిర్దేశనంచేస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫారం-బి లైసెన్స్‌ని పునరుద్ధరించుకోవడానికి సినిమా థియేటర్లు ఒక సంవత్సరానికి నిర్ణీత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లిస్తున్నాయని, మిగిలిన నాలుగు సంవత్సరాల ఛార్జీలను వారి సౌలభ్యం ప్రకారం చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ లక్ష్మి రమణి, సినిమా ధియేటర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-29 at 5.31.20 PM
Movies

ప్రజలలో చైతన్యం నింపే దిశగా సినిమా నిర్మాణం… -దర్శకుడు పీ. సత్యారెడ్డి-

జనం ఎంటర్టైన్మెంట్ బేనర్పై ఉక్కు సత్యాగ్రహం సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు పీ. సత్యారెడ్డి తెలిపారు. సినిమా నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా కాకినాడలోని స్థానిక హోటల్లో