గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలోని మంగళగిరిలో ఈ నెల 31వ తేదీన మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని అన్నారు. సభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొని మహాసభను విజయవంతం చేయనున్నారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమ సమాజ స్థాపనే ఈ సాధికార యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు.

