Exclusive

సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలి… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

WhatsApp Image 2024-02-02 at 5.35.53 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లాకు నియమించిన అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు.

జిల్లా కలెక్టర్ ను కలిసిన నూతన అధికారుల వివరాలు:

పార్వతీపురం మన్యం జిల్లా రెవిన్యూ అధికారిగా(డీఆర్వో) పనిచేస్తున్న జె. వెంకటరావు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

పల్నాడు జిల్లా పులిచింతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ. శ్రీరామ చంద్రమూర్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ (సీఈవో) అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్ పీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పి. కృష్ణమూర్తి కుడా వీసీ, ఎండీగా బాధ్యతలు స్వీకరించారు.

మరియు విశాఖపట్నం జిల్లా సింహాచలం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేవీ. రామలక్ష్మి, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి(కెఎస్ఈజెడ్) ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.