ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్య సిబ్బంది నిబద్దతతో పనిచేసి లోపాలు లేకుండా చూడాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారాజప్ప అన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ డా. అమల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలను సమీక్షించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్యుల వివరాలు అడిగి తెలుసు కున్నారు.
ఈ సందర్బంగా డా. అమల మాట్లాడుతూ… ఆసుపత్రికి జెనరేటర్ సదుపాయం ఉన్నా దానికి ఇంస్టాలేషన్ పనులు పూర్తి కాక ఉపయోగంలోకి రాలేదని ఎమ్మెల్యే కు వివరించారు. ఆసుపత్రి స్థాయికి సంభందించి అవసరమైన వైద్య సిబ్బంది అంతా నియామకం జరిగినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ఆసుపత్రిని ఆనుకుని జరుగుతున్న ఆక్రమణలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
కాగా ఈ సందర్బంగా ఆసుపత్రిలో రోగుల కోసం ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో తేదేపా నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీస్, బలుసు వాసు, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, పడాల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

