News Political

వైద్య పరీక్షలకు హైదరాబాద్‌ వెళ్తున్న చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు . స్కిల్‌ స్కామ్‌ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయనకు ఆరోగ్య కారణాలతో హైకోర్టు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదలైన ఆయన ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ అభిమానుల విజయోత్సవాల నడుమ 13 గంటల ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నారు. బుధవారం వైద్యం నిమిత్తం హైదరాబాద్‌, తిరుమల దర్శనానికి వెళ్లనున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యకర్తలు కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలలో అంకితభావంతో పనిచేయాలని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు.

Avatar

Spy News

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.