వైద్య ఆరోగ్య రంగంలో జగన్ ప్రభుత్వం కీలకమైన ఆవిష్కరణలు చేపట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ ప్రణీత పేర్కొన్నారు. గురువారం స్థానిక ఐదవ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి సతీమణి మహాలక్ష్మితో కలిసి కుమార్తెలు డాక్టర్ ప్రణీత,డాక్టర్ అంజనీ లు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

