వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు ఉండదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. మ్యానిఫెస్టో తప్పుల తడకలుగా అబద్దాల పుట్టలుగా ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించకుండానే వాటిని అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. గిరిజనులు, షెడ్యూల్ కులాల అభ్యున్నతికి ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. గిరిజనుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. పార్వతీపురం, పాడేరు ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని ప్రకటించడం అవాస్తవం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల, సాలూరులో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని ప్రకటించడం ఎస్టీలను మోసగించడమే అన్నారు.
వై.సీ.పీ. మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పుండదు… -ప్రతిపక్షాలు-

