మండపేట నియోజకవర్గంలో వై.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులకు దళిత యువకులను శిరోమండలం చేయించిన కేసులో నేరం రుజువు కావడంతో 18 నెలలు జైలు శిక్ష, రూ. 2.50 లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనితో సదరు తోట త్రిమూర్తులను వై.సీ.పీ. పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జే.ఎస్.పీ. కార్యదర్శి, దళిత సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టా జానకి రామారావు డిమాండ్ చేశారు.
అలాగే దళిత యువకుడును చంపి తనను డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత బాబుని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారిద్దరిపై తగిన చర్యలు పార్టీ పరంగా తీసుకోవాలని తెలిపారు. లేని పక్షంలో వై.సీ.పీ. ప్రభుత్వం వారికి దళితులపై దాడులు చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావించవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

