ఆంద్ర రాష్ట్ర పేదల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పని చేయాల్సిన వై.సీ.పీ. ప్రభుత్వం మాఫియాను పెంచి పోషిస్తుందని ప్రదాని నరేంద్ర మోదీ అన్నారు. వై.సీ.పీ. పాలనలో రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతుందని ఆరోపించారు. వీరి ఇసుక దాహానికి ఏకంగా అన్నమయ్య సాగునీటి డ్యాము తెగిపోయిందన్నారు. ఏకంగా కొన్ని గ్రామాలు మునిగిపోయి, 39 మంది మృతికి కారణమయ్యారని తెలుసుకొని వేదన చెందారు. ఇలాంటి ఇసుక మాఫియాను ప్రశ్నించే వారిపై దాడులు, రౌడీ రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో తీసుకువచ్చిన వై.సీ.పీ. కి కౌంటర్ మొదలైందని అన్నారు. ఇక వారు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని మోదీ స్పష్టం చేశారు. వై.సీ.పీ. పాలనలో మంత్రులు గూండాగిరి చేస్తారు.. ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటారన్నారు. పూర్తిగా అవినీతిలో మునిగిపోయిన వై.సీ.పీ. పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలి.. రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కారు రావాలి అని చెప్పారు.
వై.సీ.పీ. ని ఇంటికి పంపించే టైం వచ్చింది…

