గత ప్రభుత్వ హయాంలోని ఎక్సైజ్ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడం, బ్లాక్‌మార్కెటింగ్, బూట్‌లెగ్గింగ్‌ను ప్రోత్సహించడంతోపాటు వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర శాసనసభలో గత వై.ఎస్.ఆర్.సీ. ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ పై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి 2019-2024 మధ్య పాలన ఒక రాష్ట్రాన్ని ఎలా దుర్వినియోగం చేయకూడదో తెలుసుకోవడానికి కేస్ స్టడీగా మారిందని ధృవీకరించారు.
వై.సీ.పీ. ఎక్సైజ్ విధానాన్ని బయటపెట్టిన చంద్రబాబు నాయుడు…
