Exclusive

వినియోగదారుల రక్షణ చట్టంప్రయోజనాలు విస్కృతం చేయాలి…

WhatsApp Image 2024-02-02 at 3.50.28 PM

జిల్లా జాయింట్ కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ ఆదిత్య కు కాకినాడ పౌర సంక్షేమసంఘం గణపతి చిత్రపటాన్ని బహూకరించి పుష్ప గుచ్ఛంతో అభినందన లు తెలిపింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తమిళనాడు నుండి 2016 లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ 79 ర్యాంకు సాధించిన ప్రవీణ్ గతంలో రంపచోడవరం ఐ.టి.డి.ఎ. అధికారిగా పోలవరం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసి సమర్థవంతమైన అధికారిగా మంచి గుర్తింపుతో కాకినాడ జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా రావడం అభినందనీయ మన్నారు.

ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రయోజనాలు ప్రజల కు చేరువయ్యే సేవలు అందించాలని కోరారు. చట్టం ప్రయోజనాల కొరకు జిల్లా నగర పట్టణ మండల గ్రామ సచివాలయం స్థాయిల్లో విస్కృతంగా వినియోగ దారులసంఘాల ఏర్పాటును ప్రోత్సహించాలని పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు విజ్ఞప్తి చేశారు.

1986 డిసెంబర్ 24 న రాష్ట్రపతి ఆమోదం తో ఏర్పడిన వినియోగదారుల చట్టం ద్వారా సంఘాల ఏర్పాటుతో గుర్తింపుకు ఆర్థిక స్వప్రయోజనాలకు ప్రాకులాడకుండా అవిశ్రాంతంగా విశేష సేవలందించి దివంగతులైన పి.ఎస్.ఆర్.కె. తిమ్మాజీరావు హేజీబు సత్యనారాయణ పేరిట ఏటా ఉత్తమ సేవకులకు పౌరసంఘం అవార్డులు ఇచ్చి సత్కరిస్తామని పేర్కొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.