విజయవాడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసులు నడపడానికి చర్యలు చేపట్టాలని విజయవాడ ఎం.పీ. కేశినేని శివనాథ్ పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడును కోరారు. సోమవారం పార్లమెంట్లోని పౌరవిమానయాన మంత్రి ఛాంబర్లో చిన్ని పిలిపించి విజయవాడ నుంచి విశాఖ మీదుగా వారణాసి, విజయవాడ నుంచి కోల్కతా మీదుగా విశాఖ, విజయవాడ నుంచి అహ్మదాబాద్, విజయవాడ నుంచి కొచ్చిన్ మీదుగా విమాన సర్వీసులు నడపడానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ నుంచి మరిన్ని విమానాలు నడపండి… -విజయవాడ ఎం.పీ.-
