మిచౌంగ్ తుఫాన్ దాటికి గురయిన దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు పక్కల ఉన్న పరిసర గ్రామాలన్నీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల జలదిగ్బంధమై కుటుంభాలను జనసేన పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తన భ్రుందంతో సందర్శించి దాదాపు 250 మంది నిత్యవసర సరుకులను పంపిణీ చేసారు. కనీసం ఆహారాన్ని వండుకునే అవకాశం లేకుండా ఇక్కట్లు పడుతున్న వారిని చూసి చలించిపోయారు. ఈ సందర్బండా ఆమె మాట్లాడుతూ… కనీసం త్రాగేందుకు నీరు లేదని, నిత్యవసర సరుకులు అన్నీ తడిచిపోయి పాడైపోయాయి అన్నారు.
వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది చాప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వాధికారి గానీ, ప్రజా ప్రతినిధులు గాని, ఓట్ల కోసం వెంబడించే వాలంటీర్లు గాని, స్థానిక ఎమ్మెల్యే గాని చూసిన పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రజలంతా తిండి, నిద్ర కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో రోడ్లపై మేడలపై, ఇంటి ముంగిట వరద నీటిలో నిలుచుని సహాయం కోసం నిరీక్షిస్తున్నారు అన్నారు.

