సోమవారం బల్లియాలోని సేలంపూర్ లోక్‌సభలోని బెల్తరా రోడ్‌లోని హల్దీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో షా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… బీ.జే.పీ. 400 సీట్లు దాటబోతోందని, కాంగ్రెస్ 40 సీట్లకు పరిమితం కాబోతోందని, అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి నాలుగు కూడా రావడమే కష్టమని అన్నారు. జూన్ 4న రాహుల్ బాబా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ.వీ.ఎం. ల వల్లే బీ.జే.పీ. గెలిచిందని చెబుతారని అన్నారు. మీరు నరేంద్ర మోదీని రెండోసారి ప్రధానిని చేసినప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు జరిగాయి. ఈ ఎన్నికలు రామభక్తులపై కాల్పులు జరిపేవారికి, రామమందిరం కట్టేవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీ.జే.పీ. 400 మార్కును దాటబోతోంది… -అమిత్ షా-

