బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో ఉన్న శ్రీ సత్య సాయి విద్యాసంస్థ ప్రాంగణంలో రహదారి భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆటో క్యాబ్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, స్కూలు బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతలపై, నియమాలు పై రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ… రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని లేనిచో ప్రమాదాలకు తావు తీస్తుందని తెలిరు. ఎవరయినా రోడ్డు నియమనిభందనలను పాటించకపోతే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎం.వి.ఐ. కె.వి. నాగేంద్ర, డి.టి.ఓ. అశోక్ ప్రతాప్, రావు రావులపాలెం ఎం.వి.ఐ. ఓలేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…

