జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికెట్టి, యువతను ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక యాక్షన్ టీంలు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రుల సైతం కుటుంబాల్లో యువతను హెచ్చరిస్తూ వారిని క్రమబద్ధీకరించడం ద్వారా తోడ్పాటును అందించాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు, నాయకులు నేతల శ్రీనివాసరావు పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబుమాట్లాడుతూ… బలుసులపేట పరిధిలో ఉన్న యువత సరైన రీతిలో కనీస విద్యాభ్యాసం లేకపోవడంతో దారి తప్పుతున్నట్టు చెప్పారు.
ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతివారు కనీసం ఇంటర్మీడియట్ వరకు చదువుకొని చట్టాల పైన, మంచి చెడుల పైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఖాళీ సమయాల్లో వ్యర్థమైన కార్యకలాపాలకు లోను కాకుండా క్రీడాల పట్ల ఆసక్తి కనపరిచి సన్మార్గంలో నడిచేందుకు ప్రయత్నించాలన్నారు. ఆ విధంగా తల్లిదండ్రులు, పేటలోని ఆయా కమిటీల నాయకులు యువతకు మార్గదర్శకాలు సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో బలుసుల పేట పరిధిలోని నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

