పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన లక్షలాది రైతాంగం రైతు పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని, రుణ మాఫీ, పంటల భీమా వంటి విధానాలు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీ నగరంలో ప్రదర్శన చేసి ప్రధాని మోడీ కి మెమొరాండం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగా ఢిల్లీ యాత్రగా చేరుకుంటున్న రైతులపై బీ.జే.పీ. కేంద్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించిన దమనకాండను ఆర్.పి.ఐ. తీవ్రంగా ఖండించింది.
200 పైగా రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్, కిసాన్ మజ్దూర్ మోర్చాలు ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీకి వస్తున్న రైతులను అడ్డుకునేందుకు
రోడ్ల పైన ఇనుప మేకులు ఏర్పాటు చేయటం, రోడ్లకు కందకాలు తవ్వటం, రోడ్లకు అడ్డంగా సిమెంట్ దిమ్మలు పెట్టి రైతులను అడ్డుకునే దుర్మార్గమైన దారుణమైన ప్రయత్నాలు చేసారు.
అవన్ని అదిగమించి ఢిల్లీ చేరుకున్న రైతాంగంపై లాఠీలతో విరుచుకుపడటం, డ్రోన్ లు ద్వారా ఆకాశం నుంచి భాష్ప వాయు ప్రయోగించడం, తదితర ధుర్మార్గమయి న పనులకు ప్రభుత్వ ఫాసిస్టు లక్షణానికి తిరుగులేని ఉదాహరణలని తెలిపారు.రైతు బంధు శాస్త్రవేత్త స్వామినాథన్ కు, రైతు నాయకుడు గా భారత్ అంతటా ప్రసిద్ధి చెందిన చరణ్ సింగ్ లకు మరణానంతరం భారత రత్న బిరుదు లిచ్చి నెల తిరగకుండానే రైతులపై అత్యంత హేయమైన దాడి చేసిన మోడీ, అమిత్ షా ల ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తునట్లు ఆయన తెలిపారు.
