మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో కోనసీమ జిల్లాలో పండించిన ధాన్యo రంగు మారి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వపరంగా కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. అల్లవరం మండల పరిధిలోని రెల్లు గడ్డ గ్రామంలో ఖరీఫ్ సీజన్ వరి పంటలను మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ,జిల్లా మిచౌoగ్ తుఫాన్ సహాయక చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారిని జి. జయలక్ష్మి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాలు పరిశీలించారు.
ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా 1, 05 వేల ఎకరాలలో ఖరీఫ్ సీజన్ పంటలు నూర్పుళ్ళు జరిగి ధాన్యం కూడా రైస్ మిల్లులకు చేరిందన్నారు. 50,000 ఎకరాలలో ఖరీఫ్ పంట ఉందని దీనిలో 9,000 ఎకరాలు తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బ తిన్నసప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పిస్తోందన్నారు. రైతులు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.

