Exclusive

రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి…

WhatsApp Image 2024-02-17 at 8.54.18 PM

కాకినాడ జిల్లాలో రైతుల సమస్యలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.వి.ఎస్. ఘోరీ స్పందించారు. సామర్లకోట మండలం వి.కె. రాయపురం, మామిళ్లదొడ్డి ప్రాంతాల్లో సాగునీటి ఎడ్డది గల పంట పొలాలను ఆమె పరిశీలించారు. సాగునీరు అందక నష్టపోతున్నామాంటూ కౌలు రైతులు పురుగు మందు సీసాలతో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారులు ఇబ్బంది ఉన్న పంట పొలాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు నమోదు చేసుకున్నారు. సమస్యలన్నీ జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ కాకినాడ సహాయ సంచాలకులు పద్మశ్రీ, మండల వ్యవసాయ అధికారి ఐ. సత్య, పలువురు రైతులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231114-WA0006
Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన
IMG-20231115-WA0004
Exclusive

కాకినాడ శిషుగృహకు చేరిన ఉప్పలగుప్తం శిశువు

ఈ నెల 3వ తారీఖున ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామం నందు దొరికిన గుర్తుతెలియని ఆడ శిశువును 10 రోజుల చికిత్స అనంతరం గౌరవ C.W.C.